TG: ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకు ‘బులెట్ రైలు’ ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగానికి అనుమతులతో పాటు నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరారు.