JGL: వీరాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం మంగళవారం ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన దుండిగాల గంగు ఒకరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడంతో పాటు 8 వార్డులకు ఒక్కొక్కరే నామినేషన్ వేశారు. దీంతో వారందరూ ఏకగ్రీవమయ్యారు. దిండిగాల గంగు గ్రామంలో ఇదివరకే రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పని చేశారు. నామినేషన్ల చివరి రోజు కావడంతో వీరు ఏకగ్రీవమయ్యారు.