నెల్లూరు: రూరల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ నేతాజీ నగర్లో 35 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ భవన్ పనులను TDP నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 33వ డివిజన్ అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, అంబేద్కర్ భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.