AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వైరస్ పల్నాడు జిల్లాలో ప్రాణాలు తీస్తోంది. టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి చికిత్స అందిస్తున్నారు. ముప్పాళ్ల(M) రుద్రవరంలో టైఫస్ లక్షణాలతో ఇంటర్ విద్యార్థి జ్యోతి(20), RR సెంటర్కు చెందిన నాగమ్మ(62) మృతి చెందారు. 20 రోజుల క్రితం వారిద్దరు జ్వరం, ఒంటినొప్పులతో ఆస్పత్రిలో చేరారు.