ప్రకాశం: ఒంగోలులో బాల్య వివాహంపై కేసు నమోదైంది. బలరాం కాలనీకి చెందిన 9వ తరగతి బాలికకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువకుడితో గత నెల 28న వివాహం జరిగింది. పెళ్లి ఇష్టం లేని బాలిక 1098కు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. వివాహం జరిగినట్లు నిర్ధారించుకుని, బాలిక తల్లిదండ్రులు, వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేశారు.