HYD: నగరంలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుంది. పొగ మంచుకు కాలుష్యం తోడవుతుండడంతో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు నగరంలో పడిపోతుంది. దీంతో గాలి కాలుష్యంపై ప్రజలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో భారీగా కాలుష్యం పెరగగా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.