BHNG: ఆలేరు మండలం భైరాంనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంపరాజు వెంకటేశ్వరరాజును గ్రామస్తులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి దిశగా సమిష్టిగా ముందుకు సాగాలనే సంకల్పంతో పలువురు నాయకులు మరియు గ్రామ పెద్దల సమన్వయంతో ప్రజలు ఏకమై ఆయనకు తమ మద్దతును ప్రకటించారు.