JGL: సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపులో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఇంఛార్జ్ డీపీవో రేవంత్ పేర్కొన్నారు. మంగళవారం కథలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి అభ్యర్థి నామినేషన్ పరిశీలించి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. అనంతరం వారికి గుర్తులు కేటాయించాలన్నారు.