ATP: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే జేసీ క్రికెట్ టోర్నమెంట్ ఈసారి ‘సీజన్ 4’ రూపంలో ముందుకు వచ్చింది. ఈ టోర్నమెంట్లో తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరిలో జరిగే టోర్నీలో విజేతకు రూ. 1,00,000, రన్నర్‌కు రూ. 60,000 నగదు బహుమతులుగా అందిస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు.