BDK: 1969లో తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచి మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల పాలనలో ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభం అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు ఇక్కడి నుంచే తొలి అడుగులు పడ్డాయని, రానున్న పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.