NZB: రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నిన్నటితో ముగిసిందని సిరికొండ MPDO మనోహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు137, వార్డు సభ్యులకు 529 నామినేషన్లు అందినట్లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. నేడు స్క్రూటినీ పూర్తయ్యాక, సాయంత్రం 5 గంటల తర్వాత వ్యాలీడ్ నామినేషన్ల జాబితాను బోర్డుపై అతికిస్తామన్నారు.