PPM: సాలూరు పురపాలక సంఘం పరిధిలో 26 మరుగుదొడ్ల మరమ్మతులకు టెండర్లను ఆహ్వానించామని, కానీ ఎవరు ముందుకు రాలేదని పురపాలక సంఘం కమిషనర్ టీ. రత్నకుమార్ మంగళవారం తెలిపారు. సాలూరులో మొత్తం 35 మరుగుదొడ్లు ఉన్నాయని, అందులో 11 సామాజిక మరుగుదొడ్లు పూర్తిగా మరమ్మతులు గురికాగా..15 పాక్షికంగా మరమ్మతులు చేయవలసి ఉందన్నారు.