హార్దిక్ పాండ్యా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో పలు సిరీస్లకు దూరంగా ఉన్న పాండ్యా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అతడికి బౌలింగ్ చేయడానికి అనుమతినిచ్చింది. దీంతో ఈనెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే T20 సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అంతకుముందే ‘SMAT-2025’లో బరోడా జట్టు తరఫున ఆడనున్నట్లు సమాచారం.