MBNR: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించామని వివరించారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుందని, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందని హెచ్చరించారు. గత పాలకులు ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని పూర్తి చేయలేదని విమర్శించారు.