విశాఖ జిల్లాలో వివిధ బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల వెంటనే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య AIYF అధ్యక్ష కార్యదర్శులు వై.రాంబాబు, కే. అచ్యుత రావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. రుణాల మంజూరు కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారని, కూటమి ప్రభుత్వం రుణాలు విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు.