చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 31 వినతులు అందాయి. ఈ మేరకు ఎస్పీ తుషార్ డూడీ అర్జీలు స్వీకరించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.