MBNR: మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు ఉద్యోగాలు పదవులను అనుభవిస్తున్నామన్నారు.