లోక్సభలో గందరగోళం కంటిన్యూ అవుతోంది. సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాల ఆందోళన మాత్రం ఆగలేదు. ‘SIR’ అంశంపై తక్షణం చర్చ జరగాల్సిందేనంటూ ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. ఈ గొడవ మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను (Question Hour) కొనసాగిస్తున్నారు. చర్చకు అనుమతి ఇచ్చేదాకా తగ్గేదేలే అని విపక్షాలు పట్టుబడుతుండటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.