కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ‘మసాలా బాండ్ల’ నిధుల సేకరణలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని సీఎంకు, మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. KIIFB ద్వారా విదేశాల నుంచి నిధులు సేకరించడంలో.. రూ.466 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపించింది. అయితే, వీరు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పనిలేదని ఈడీ తెలిపింది.