NLG: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ కీలకం కానున్నాయి. సర్పంచు గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్, పలక, బ్లాక్ బోర్డ్ వంటివి ఒకేలా ఉండడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని. ప్రచారం సరిగ్గా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉందని సర్పంచ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.