ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలకు 6 గ్రామాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి, వాంకిడిలోని లెండిగూడ, నవెగూడ, దాబా పంచాయతీల్లో సర్పంచ్ పదవికి ఒక నామినేషన్ దాఖలైంది. కెరమెరిలోని బాబేఝరి, ధనోరా గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఒక నామినేషన్ వేయించారు. లింగాపూర్లోని కంచన్ పల్లిలో ఒక్కరే నామినేషన్ వేశారు.