KNR: మొదటి విడతలో 92 గ్రామపంచాయతీలకు సర్పంచ్ స్థానం కోసం దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా, 730 నామినేషన్లలో 267 తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మొత్తం 463 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలవనున్నారు. అలాగే 866 వార్డులకు గాను 2,174 నామినేషన్లు అందగా, 235 తిరస్కరణ అనంతరం 1,939 మంది పోటీలో మిగిలారు.