KNR: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని నామినేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి, ప్రక్రియను పర్యవేక్షించారు. సోమ, మంగళవారాలలో అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, ఇతర అధికారులకు ఆయన సూచించారు.