AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. దర్శనీయ ప్రవేశాలు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసేశారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులను అలిపిరి వద్ద TTD భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలలోని ఐదు డ్యామ్లు పూర్తి నిండి పొంగి పొర్లుతున్నాయని TTD వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.