హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకుంది. దూరపు బంధువు మయాంక్ లైంగిక వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘డ్రగ్స్‌కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల NOV 22 ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్‌పై చర్యలు తీసుకోలేదని ఫైర్ అవుతున్నారు.