GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు సోమవారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆయన నేరుగా నగదును అందజేశారు. పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.