NLG: వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రామస్తులు తమ గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లడానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.