JGL: మెట్పల్లి మున్సిపాలిటీలో విజిలెన్స్ విచారణ చేపట్టాలని, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తొలగించిన కొందరు కాంట్రాక్టు ఉద్యోగులను ఉన్నతాధికారులు మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై విచారణ జరపాలని కోరారు.