VZM: బొబ్బిలిలోని కోర్టు జంక్షన్లో తాగునీటి పైపులైన్ లీకులను నివారించాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. లీకులను సోమవారం ఆయన పరిశీలించారు. పైపులైన్ లీకులతో తాగునీరు వృథాగా మారుతుందని చెప్పారు. రోడ్డు పక్కనే గొయ్యి ఉండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.