ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కొత్తూరులో చాయ్ 3.0 కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీ తాగుతూ వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.