అబుదాబీ టీ10 లీగ్ ఫైనల్లో UAE బుల్స్ ప్లేయర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఆస్పిన్ స్టాలియన్స్ (APS)తో జరిగిన పోరులో 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 ఫోర్లతో భారీ స్కోర్(98) చేశాడు. చివర్లో 9 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టడం విశేషం. డేవిడ్ దూకుడుతో UAE 10 ఓవర్లలో 150 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో APS 70 పరుగులకే పరిమితమైంది. దీంతో UAE బుల్స్ టీ10 టైటిల్ను గెలుచుకుంది.