ప్రకాశం: దర్శిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించడానికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. దర్శి నియోజకవర్గంలో కొనసాగుతున్న రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, సిబ్బంది కొరత, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కూడా ఇద్దరూ చర్చించారు. మంత్రి అనగాని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.