ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల (2025-27) కాలానికి 294 షాపులను దక్కించుకున్న లైసెన్స్‌దారులకు అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఆ వెంటనే న్యూఇయర్ వేడుకలు, మేడారం జాతర రానున్న నేపథ్యంలో కొత్త షాపుల్లో భారీగా అమ్మకాలు జరగనున్నాయి.