HYD: ప్రేమించిన యువతికి వివాహం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం PS పరిధిలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన అభిలాష్, ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. దీన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.