భారత మహిళల చీఫ్ కోచ్గా సాంటియాగో నివా ఎంపికయ్యాడు. 2017-22 మధ్య ఆయన జాతీయ బాక్సింగ్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక నుంచి మహిళా బాక్సర్లకు కోచ్గా సేవలందించనున్నట్లు బీఎఫ్ఐ ప్రకటనలో పేర్కొంది. భారత బాక్సర్లతో తిరిగి మమేకం కావడం సంతోషంగా ఉందని సాంటియాగో తెలిపాడు.