JN: రైతుల సంక్షేమం కోసమే నూతన విత్తన చట్టం తీసుకొచ్చినట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఈరోజు “నూతన విత్తన చట్టం – 2025” ముసాయిదాపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే నూతన విత్తన చట్టం యొక్క ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని పాల్గొన్నారు.