WGL: పట్టణ కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఇవాళ బీసీ వెల్ఫేర్ కమిషనర్, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ బి.బాల మాయదేవి (IAS) దర్శించుకున్నారు. ఆలయ ఈవో సునీత, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆమెను ఆహ్వానించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు.