మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రెండవ రోజు ఇవాళ 338 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. జిల్లాలోని అల్లాదుర్గం, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, రేగోడు, పెద్ద శంకరంపేట, టేక్మాల్ మండలాలలో సర్పంచి పదవికి 152, వార్డు సభ్యులకు 186 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.