CTR: ప్రతి ఒక్కరూ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ ప్రమీల సూచించారు. సదుం మండలంలోని మద్దెలవారిపల్లె ఎస్సీ కాలనీలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. మండలంలో ఎస్సీ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. భూసమస్యలు పరిష్కరించాలని దళిత సంఘం నాయకుడు సీతాపతి కోరారు. సమావేశం దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు.