NRPT: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08506–283122కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రాజకీయ నాయకులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు.