MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం పునఃప్రారంభించినట్లు ఛైర్మన్ పంజాల ఆంజనేయులు గౌడ్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందజేయడం జరుగుతుందని వివరించారు. రైతులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు.