JN: స్టేషన్ ఘన్పుర్ మండలం ఇప్పగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మందపురం అనిత -సతీష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పార్టీ తరుపున ఆ పార్టీ శ్రేణుల సమక్షంలో ఆమె ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇటీవల జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్తలు ఆమెను ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు.