NDL: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రూ.500, రూ.300 టికెట్టు పొందిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. అలాగే నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడతామన్నారు.