MDK: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ పత్రాలతో జత చేయాల్సిన కుల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ వెంటనే జారీ చేస్తారని ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. తూప్రాన్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించారు. MRO వద్ద ఇద్దరి సాక్షుల సంతకాలతో దరఖాస్తు చేయాలన్నారు. పాత కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ సమర్పించవచ్చని పేర్కొన్నారు.