కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తాచెదారాలను ప్రాసెసింగ్ చేసేందుకు ప్లాస్మా గ్రూపు కాంట్రాక్టర్ ముందుకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవి, అధికారులు పాల్గొన్నారు.