NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చెంచు రామయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.