కరీంనగర్ రూరల్ మండలంలోని దురేడులో అక్రమంగా మద్యం నిల్వ చేయగా దాడిచేసి పట్టుకున్నట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ఊర్మిళ అనే మహిళ ఎలాంటి అనుమతులు లేకుండా, గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉన్నా, అక్రమంగా మద్యం అమ్ముతుందనే పక్కా సమాచారం మేరకు దాడి చేసి రూ. 15,000 విలువగల మద్యం బాటిళ్లు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.