KRNL: అనంత జిల్లా రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్యాబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కర్నూలుకు చెందిన అమూల్యకు ఐదేళ్ల కిందట రవికుమార్‌తో వివాహమైంది. కాగా, గురువారం సాయంత్రం భర్త విధులు ముగించుకుని రాగా, తలుపులు తీయలేదు. పోలీసుల సాయంతో పగొలగొట్టి చూడగా ఓ గదితో రక్తపు మడుగులో బాలుడు సహస్ర(3), మరో గదిలో అమూల్య ఉరివేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.