VSP: అగనంపూడి సెక్షన్లోని 33/11KV విద్యుత్ లైన్ మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు ఎగ్జిక్యూట్ ఇంజినీర్ ఎస్.రామకృష్ణ తెలిపారు. డొంకాడ, బీసీ కాలనీ, కొండయ్య వలస, సాయినగర్,పెద్దమడక, పినమడక, దువ్వాడ సెక్టార్-1, మంగళపాలెం, శెట్టివానిపాలెం, వీ.కొత్తూరు, లంకిలవానిపాలెంలో ఉ.10 నుంచి మ.3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.