SRD: సిర్గాపూర్ మండలంలోని అంతర్గాం, బొక్కస్‌గాం, పెద్ద ముబారక్పూర్, గరిడేగాం గ్రామాలను ఎస్సై మహేష్ గురువారం సందర్శించి పోలింగ్ బూతులను పరిశీలించారు. ఈ మేరకు బూత్‌లలో కనీస సౌకర్యాలపై సంబంధిత పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు.